అమ్మ ఒడి పథకం రెండో విడత పథకం ప్రారంభోత్సవం కోసం నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభ… అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య ధోరణికి దారితీసినట్టుగా కనిపిస్తోంది. కనీసం సీఎం సభకోసమైనా కలిసికట్టుగా కనిపించాల్సిన నేతలు.. ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు అనిల్, మేకపాటి బలప్రదర్శనకు దిగినట్టుగా అనిపిస్తోంది.
జగన్ సభ నిర్వహణ అంతా పూర్తిగా మంత్రి అనిల్,ఎమ్మెల్యే కోటంరెడ్డి కంట్రోల్‌లో ఉంది. నెల్లూరు మొత్తం జగన్‌ని ఆహ్వానిస్తూ తమ పేర్లతో ఉన్న హోర్డింగులతో ఆ ఇద్దరు నింపేశారు. అనిల్ ఇంత హడావుడి చేస్తున్నా.. జిల్లాకు చెందిన మిగిలిన నేతలు మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయారు. రెడ్డి లీడర్లు మంత్రి మేకపాటి ఇంటికి క్యూ కట్టారు. ఒక్కరు కూడా అనిల్ ఇంటి వైపు కన్నెత్తి చూడలేదని తెలుస్తోంది. దీంతో మిగిలిన బీసి నేతలు.. జిల్లాలో కూడా రెడ్డి లీడర్ల డామినేషనే జరుగుతోందని గుసగుసలాడుకుంటున్నారు.
వీరి హంగామా ఇలా ఉంటే.. జిల్లా ఎమ్మెల్యేలు కాకాణి, ఆనం మాత్రం అసలు సభ ఏర్పాట్ల వైపు తొంగిచూడకపోవడం చర్చనీయాంశమైంది.