టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ భేటీ కావడం పై వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్తత తండ్రి చంద్రబాబు వద్దకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వెళ్లాడని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు ఎలా అవసరం అయితే అలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నది బహిరంగ రహస్యమే. ఇంకా ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట.. ముసుగు తీసేయండయ్యా..జనాలు కూడా మీ ఇద్దరికీ కలిసి గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధం ఉన్నారు.. అంటూ అమర్నాథ్ ట్వీట్ చేశారు.
ఇక మల్లాది విష్ణు స్పందిస్తూ..చంద్రబాబు, పవన్ మసుగు తొలిగిపోయిందని పేర్కొన్నారు. పవన్,చంద్రబాబు కలయికతో ఏపీకి ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. అటు, మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ భేటీ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం తెలిసిందే. కాగా వైసీపీ నేతల విమర్శల పట్ల టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీతో వైసీపీ నేతలు, మంత్రులకు ప్యాంట్లు తడిచిపోతున్నట్టున్నాయి.. ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్తగా డైపర్స్ వాడండి.. అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.