వైఎస్ జగన్ బెయిల్ రద్దు కానుందనే ఆందోళన వైకాపా శ్రేణుల్లో మొదలయింది. బీజేపీతో పెరుగుతన్న దూరం, వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ గూటికి చేరబోతున్నారు అనే వార్తలకు తోడు… అఖిలపక్ష సమావేశంలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడబోయి అమిత్‌షా దగ్గర మంచి మార్కులు కొట్టేయొచ్చనుకున్న వైసీపీ కీలక నేత విజయసాయికి చీవాట్లు… ఇలా అన్నింటిన బేరీజు వేసుకున్న మంత్రులు ఇప్పుడు తమకే సీఎం పదవి అన్న అభిప్రాయంతో ఉన్నారు.
సీనియర్ మంత్రులంతా ఇప్పుడు అంతా జగన్ కుర్చీకి ఎసరు పెట్టారు. సీఎం జగన్ ఎలాగూ జైలుకు వెళ్లక తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. తమకు సీఎం కుర్చీ దక్కే అవకాశం ఉందని భావిస్తోన్న మంత్రులు… ఇప్పుడు ఎమ్మెల్యేలతో సఖ్యతతో ఉంటున్నారు. ఇప్పటికే నెంబర్ 2గా కొనసాగుతున్న హైలీ రెస్పెక్టెడ్ కోటాతోపాటు సీనియర్ అయిన మంత్రి పెద్దిరెడ్డి త్వరలో తానే సీఎంని అని ప్రచారం చేసుకుంటున్నారట. తన తనయుడు మిథున్ రెడ్డి ఢిల్లీలోనూ తన తండ్రి సీఎం కావడానికి అనువుగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఇక ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రికి ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి కావాలని కోరిక. అది ఈ జన్మలో తీరదేమో అనుకున్నా…వైఎస్ జగన్ బెయిల్ రద్దవుతుందనే ప్రచారం నేపథ్యంలో తన చిరకాలవాంఛ అయిన సీఎం సీటు దక్కించుకునే చాన్స్ ఎలాగైనా వదులుకోకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నారట. ఇప్పటికే తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలనంతా ఒక గ్రూపుగా కూడగడుతున్నారట.
సీనియర్ల ప్రయత్నాలు ఇలా ఉంటే.. జగన్ తన భార్య భారతిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలనే నిర్ణయానికొచ్చేశారట. దీనికనుగుణంగా ఆమెకు పాలనాపరంగా, పార్టీపరంగా అన్ని వ్యవహారాలపై పూర్తిగా అవగాహన కల్పించే శిక్షణ ఇస్తున్నారట.
ఇప్పుడీ అంశాలే… వైసీపీ శ్రేణుల్లో, ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్ అవుతున్నాయి. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఈ వార్తలకు ఊతం ఇస్తున్నట్లు, బీజేపీ అడుగులు కూడా జగన్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయని కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ:
చనిపోయినా భయపెడుతోన్న జార్జి రెడ్డి