వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుండి తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించే నేత ఆమె. మూడు రాజధానులపై వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న నాయకురాలు. టీడీపీ ప్రభుత్వంలో పదవులు అనుభవించని ఎందరో కామ్‌గా ఉన్న సమయంలోనూ టీడీపీ వాయిస్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేతపై ఎదుర్కొనే దైర్యం లేక, సోషల్ మీడియా వేదికగా దిగజారి మాట్లాడుతున్నారు.
ప్రతి మనిషికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు రావటం సహాజం. అందరిలాగే టీడీపీ అధికార ప్రతినిధి అనురాధకు కూడా ఆరోగ్య సమస్య ఉంది. ఆమె క్యాన్సర్‌తో బాధపడి… దైర్యంగా క్యాన్సర్ మహమ్మారిని జయించింది. కానీ క్యాన్సర్ కోసం చికిత్స చేయించుకుంటున్న సమయంలో… ఆమె జుట్టు బాగా రాలిపోయింది.
Advertisements
రాజకీయ విమర్శలను ఎదుర్కొనే దైర్యం లేక సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరులు విగ్గుతో వస్తుంది, విగ్గు మేలం, విగ్గు అంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై అనురాధతో పాటు పలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. క్యాన్సర్ వ్యాధిని జయించిన ఓ మహిళ దృడ సంకల్పాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఇలాంటి కారు కూతలు కూయటమేంటని ప్రశ్నిస్తున్నాయి. మీ ఇంట్లో వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బంది వస్తే ఇలాగే మాట్లాడుతారా అని నిలదీస్తున్నాయి.