రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపు దాదాపు ఖరారయ్యింది. నిన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెకు మద్దతు తెలిపారు. తాజాగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. దేశ చరిత్రలోనే రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ఓ గిరిజన మహిళ ద్రౌపది ముర్మకు అవకాశం ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయామని అన్నారు.
అయితే శుక్రవారం ఆమె నామినేషన్ వేసే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హాజరు కాలేకపోయారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ముందుగానే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించాలని అనుకోవడమే దీనికి కారణం. అందుకే ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభలో పార్టీ పక్ష నేత పీవీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
1958లో జన్మించిన ద్రౌపది ముర్ము.. గిరిజన సమాజానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఒడిశాకు చెందిన 64 ఏళ్ల ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే.. భారత తొలి గిరిజన రాష్ట్రపతిగా చరిత్రకెక్కుతారు. జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన మొదటి గిరిజన మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు.
ఆమె BA పాస్ అయి ఆరోబిందో కాలేజిలో హానరరీ ప్రొఫెసర్ పదవిలో పని చేసి ఒరిస్సా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు.
1997 లో ఆమె బీజేపీలో జాయిన్ అయ్యారు. 1997లోనే రాయ్ రంగపూర్ లో కౌన్సిలర్ గా మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో గెలిచారు. తరువాత అదే సం. లో ఆమె రాయ్ రంగ్ పూర్ వైస్ చైర్మన్ అయ్యారు.
2000 సం. లో ఆమె అక్కడ నుండే MLA గా గెలిచి బీజేడీ-బిజెపి ప్రభుత్వం లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి క్రింద రవాణా శాఖా మంత్రిగా, 2002 లో ఫిషరీస్ మరియు ఆనిమల్ హాజ్బండ్రి మంత్రిగా 2004 వరకు చేశారు. 2004లో అక్కడ నుండే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి 2009వరకు వున్నారు. మధ్యలో కొన్ని సం. లు తప్ప 2002 నుండి 2015 వరకు ఆమె మయుర్బంజ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ గా వున్నారు. ఆమె ఒరిస్సా బిజెపి రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ గా కూడా చేశారు.
2015లో ఆమె జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్ గా నియమింపబడ్డారు. ఆమె 2021 వరకు ఈ పదవిలో వున్నారు. ఈమె ఒరిస్సా నుండి ఎంపిక కాబడిన మొదటి మహిళా ట్రైబల్ గవర్నర్. అంతే కాదు ఈమె దేశంలో నియమింపబడ్డ మొట్ట మొదటి ట్రైబల్ గవర్నర్ కూడా.
NDA ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలకు ఈమె పేరు నామినేట్ చేశారు. 2017 రాష్ట్రపతి ఎన్నికలు అప్పుడు కూడా ఈమె పేరు పరిశీలన లోకి వచ్చినా అప్పుడు రామనాధ్ కోవింద్ పేరు చివరికి ఖరారు అయింది.
ఈ సారి కూడా NDA సుమారు 20 పేర్లు పరిశీలించి చివరకు ద్రౌపది ముర్ము పేరు ఖరారు చేశారు.