సాధారణ ఎన్నికల్లో విశాఖలో పెద్దని ప్రభావం చూపని అధికార వైసీపీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం దూసుకుపోయింది. పరిపాలన రాజధాని అంశం ఆ పార్టీ బాగా కలిసొచ్చినట్టే కనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో వైసీపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పీఠం వైసీపీ వశమైంది.
జీవీఎంసీలోని మొత్తం 98 స్థానాల్లో వైసీపీ 58 చోట్ల గెలుపొంది విజయ దుందుబి మోగించింది. గ్రేటర్ విశాఖ పీఠంపై వైసీపీ జెండా ఎగురవేసింది. ఇక మిగిలిన వాటిలో 30 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన విజయం సాధించాయి. బీజేపీ, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో గెలుపొందగా.. మరో 4 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. ఒకరకంగా టీడీపీకి గట్టి బలం ఉన్న విశాఖలో స్థానిక ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొని ఉంటూ వచ్చింది. కానీ అనూహ్యంగా వైసీపీ విజయం సాధించింది.