ఏడు చేపల కథ… టీజర్ తోనే న్యూస్ ఛానెల్స్ లో హాట్ టాపిక్ గా మారి, రీసెంట్ గా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అడల్ట్ సినిమాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా దాదాపు 600 థియేటర్స్ లో రిలీజైంది. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ రిలీజ్ దక్కడం ఆశ్చర్యపరిచే విషయం. మొదటిరోజే బి, సి సెంటర్స్ లో చాలా చోట్ల హౌజ్ ఫుల్ షోస్ రాబట్టిన ఏడు చేపల కథ మొదటిరోజే కోటి రూపాయల వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చిన ఈ కలెక్షన్స్ ఏరియా వైజ్ డీటెయిల్స్…
నైజాం : 38 లక్షలు
సీడెడ్ : 21 లక్షలు
ఉత్తరాంధ్ర : 13 లక్షలు
ఈస్ట్ : 8 లక్షలు
వెస్ట్ : 6.5 లక్షలు
కృష్ణా : 7.4 లక్షలు
గుంటూరు : 7 లక్షలు
నెల్లూరు : 5 లక్షలు
ఏపి/ తెలంగాణ : 1.06 కోట్లు
అసలు విడుదలవుతుందా లేదా అను అనుమానం కలిగించే స్థాయిలో రచ్చ చేసిన ఏడు చేపల కథ, మొదటిరోజు హౌజ్ ఫుల్ షోస్ తో కోటి రూపాయలు రాబట్టడం చూసిన వాళ్లు మాత్రం, మన యూత్ నిజంగా ఇంత కరువులో ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు జరిగి మనం ఎంత ఎదవలమో నిరూపిస్తూ ఉంటాయి. ఇది కూడా అలాగే ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.