నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మరోసారి పసుపు రైతుల సెగ తగిలింది. తమకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అందుకు నిరసనగా ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఆయన ఇంటి ముందు పసుపు పంట పోసి నిరసనకు దిగారు రైతులు. ఎన్నికల్లో బాండ్ పేపర్ పై రాసిచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకుంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఓట్ల కోసం అరవింద్ తమ మనోభావాలతో ఆడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు పసుపు రైతులు.
కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డ్ తీసుకొస్తానని మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించాలని.. లేదంటే ప్రజలే బుద్ధిచెప్తారని విరుచుకుపడ్డారు పసుపు రైతులు.