ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి రావడం, వచ్చినా ‘స్టార్’గా ఎదగడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. స్వయంకృషితో అలా ఎదిగిన స్టార్స్‌ని వేళ్ళమీద లెక్కెట్టొచ్చు. ‘నేచురల్ స్టార్’గా ఇమేజ్ తెచ్చుకున్న హీరో నాని ఆ లిస్టులో ఒకరు.
ఎంచుకునే సినిమాల్లో వైవిధ్యం చూపిస్తూ.. హిట్స్ అందిస్తూ టాలివుడ్‌లో మంచిపేరు సంపాదించుకున్నాడు నాని. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా మారి ‘ఆ’ అనే డిఫరెంట్ మూవీతో తనకు సినిమాపై ఉన్న ప్రేమ ఎలాంటిదో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుత సినిమాల విషయానికొస్తే విక్రం కుమార్ డైరెక్షన్‌లో చేసిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ విలన్‌గా చేయడం ఒక విశేషం.
ఈ చిత్రం తర్వాత నానీ మరో ప్రయోగాత్మక చిత్రానికి ప్రిపేరయ్యాడు. ‘వీ’ అనే మూవీలో నటించబోతున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన ఒక సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, నానీ అందులో చేస్తున్నాడని తాజాగా ఒక టాక్ వినిపిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా, టబు అండ్ రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘అంధా ధున్’ బాలివుడ్‌లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో విజువల్లీ ఛాలెంజ్డ్ రోల్ చేసిన హీరో ఆయుష్మాన్ నేషనల్ అవార్డ్ కూడా సాధించుకున్నాడు. శ్రీరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నాని చేస్తుండటం ఒక హైలైట్.
‘నేచురల్ స్టార్’ నానికి ఇది తప్పకుండా మరో ఛాలెంజింగ్ రోల్ అవుతుంది. నానీ యాక్టింగ్ గురించి తెలిసిన వారందరూ తను ఈ పాత్రలో జీవించేస్తాడని చెబుతున్నారు. సో.. నానీ ఏకంగా అవార్డ్ విన్నింగ్ కేరెక్టర్ పైనే కన్నేశాడని అనుకోవచ్చు.!!!