దేశంలో పెట్రో మంట కొనసాగుతోంది. గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో ప్రజలకు యోగా గురు రామ్ దేవ్ బాబా ఒక సూచన చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి దేశ ప్రజలు తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి కృషి చేయాలని సూచించారు.
తనలాంటి సన్యాసులు కూడా కష్టపడి పని చేస్తున్నప్పుడు, సాధారణ ప్రజలు కూడా ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కష్టపడవచ్చని సూచనలు చేశారు.
దేశాన్ని నడపడానికి ప్రభుత్వం పన్నులు వసూలు చేయాల్సి ఉంటుదన్నారు. ఒక సన్యాసిగా తాను 18 గంటలు కష్టపడుతున్నానని ఆయన చెప్పారు. అలాంటప్పుడు సాధారణ ప్రజలు కూడా కష్టపడి తమ ఆదాయం పెంచుకోవచ్చని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవచ్చన్నారు.