టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్’మూవీ బిజెపి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. 26/11/2008న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. టెర్రరిస్టులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ సినిమా.. తాజాగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రధేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ సినిమా చూసి మేజర్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు.
మేజర్ సినిమా టీమ్ .. యూపీ ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా షో వేసారు. ఈ మూవీ చూసి యోగీ ఆదిత్యనాథ్ భావోద్వేగానికీ గురయ్యారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నిజమైన దేశ భక్తుడి జీవితం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ మేజర్ సినిమా టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
మేజర్ సినిమా టీమ్‌తో పాటు మేజర్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులకు యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా మెమెంటోలను అందజేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర యోధుడి తల్లిదండ్రులను సత్కరించారు.
Advertisements
మేజర్ మూవీలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు శశి కిరణ్ తిక్క. మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది. 19 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.