ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లక్నో లోని వాజ్ పాయ్ ఎక్నా స్టేడియంలో నిర్వహించారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ప్రమాణం చేయించారు.
ఆయనతో పాటు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేశ్ పాతక్ లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం యోగీతో పాటు మొత్తం 52 మంది మంత్రులు శుక్రవారం ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో 403కు గాను 274 సీట్లను గెలుచుకుంది. దీంతో రాష్ట్రంలో వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిగా ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు.