యశోద ఆసుపత్రి అరేంఓ, ఆయన భార్య, తల్లికి కూడా కరోనా వైరస్ సోకినట్లు యశోదా యాజమాన్యం ప్రకటించింది. అయితే వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం యశోద ఆసుపత్రిలొనే చికిత్స అందిస్తున్నామని, వారంతా క్షేమంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని ఆశిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇక తమ ఆసుపత్రిని కరోనా కారణంగా మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని, కరోనా వైరస్ కు సైతం చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కరోనా వైరస్ చికిత్స ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబులకు పర్మిషన్ ఇచ్చే ఉద్దేశ్యం తమకు లేదని… ప్రభుత్వం వద్ద శక్తి ఉందని, ప్రభుత్వమే ఈ విపత్తును ఎదుర్కొంటుందని… ప్రజల వద్ద ప్రైవేట్ సంస్థలు అధిక డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.