ఇటీవల కాలంలో పాత కాయిన్లు, నోట్లకు డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. కొంతమంది వాటిని అదృష్టంగా భావించి లక్షలు వెచ్చింది కొంటున్నారు. మరికొంత మంది మాత్రం పాత నోట్లు, కాయిన్స్ ను సేకరించే అలవాటు వల్ల వాటిని కొనడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు. ఇక మీ దగ్గర గనుక ఇలాంటి కాయిన్స్ ఉన్నాయంటే లక్ మీదే. లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని లక్షాధికారులను చేస్తుంది. ఇలాంటి సమయం పాత నోట్లు, కాయిన్స్ ను సేకరించే అలవాటు ఉన్నోళ్లకు బాగా ఉపయోగపడుతుంది.
అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో పాత నాణేలను వేలం వేసి లక్షలు సంపాదించొచ్చు.1, 2 రూపాయల పాత కాయిన్స్, రూ .1,2,5 పాత నోట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ అరుదైన పాత నాణేలు, నోట్లను అమ్మి ఆన్లైన్ లో దాదాపు రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చు. రీసెంట్ గా ఆన్‌లైన్ వేలంలో ఒక రూపాయి నాణెం రూ. 10 లక్షలకు వేలం వేశారు. దాన్ని ఆ ధరకు కొన్నారు కూడా. ఈ ప్రత్యేక ఒక రూపాయి నాణెం 1885 లో భారతదేశంలో బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో జారీ చేశారు.
ఆసక్తికరం విషయం ఏమిటంటే అమ్మవారి ముద్రతో ఉన్న రూ .5 , రూ .10 నాణేలు ఉన్నా కూడా భారీ అమౌంట్ సంపాదించవచ్చు. ఈ ప్రత్యేక నాణేలు 2002 లో జారీ చేశారు. అమ్మ వారి ముద్రతో ఉన్న నాణేలను పవిత్రమైన, అదృష్టం తెచ్చేదిగా భావిస్తున్నారు. ఈ నాణెం కొనుగోలు చేయడానికి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేసేవారు సిద్ధంగా ఉన్నారు. IndiaMART.com, CoinBazar వంటి వెబ్‌సైట్లు పాత అరుదైన నాణేలు, నోట్‌లకు బదులుగా లక్షలు సంపాదించే మార్గాలను చూపిస్తున్నాయి.