బాలీవుడ్ బ్యూటీ కంగనా ఆఫీసు కూల్చివేత వివాదంపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధించడానికి కంగనా.. రాజకీయ నేత కాదని అన్నారు. కంగనా వివాదం శివసేన స్వయంకృతాపరాధమని విమర్శించారు. శివసేన ప్రభుత్వం దావూద్ ఇంటిని కూల్చలేదు కానీ.. కంగనా ఇంటిని మాత్రం కూల్చగలదంటూ ఎద్దేవా చేశారు.
కంగనా దూకుడు వెనక కొన్ని పార్టీలు, శక్తిమంతమైన వ్యక్తులు ఉన్నారని శివసేన ఇప్పటికే వాదిస్తోంది. పరోక్షంగా బీజేపీ నేతలే ఉన్నారంటూ శివసేన నేతలు కామెంట్ చేయడంతో.. ఫడ్నవిస్ ఈ మేరకు ఆ ఆరోపణలని ఖండించారు.