దిగ్దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శకత్వం వహించిన జానపథ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా వచ్చి దేశం మొత్తం తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేసింది.
అప్పటి వరకు సినీప్రపంచం పదిలంగా దాచుకున్న రికార్డులన్ని బద్దలు కొట్టింది. బాహుబలి … నాన్ బాహుబలి అంటూ బాక్సాఫీసు దగ్గర పెద్ద బోర్డర్ గీసింది. అయితే ఈ మూవీని ఇప్పటికే మనం చాలా సార్లు చూశాం.
కానీ ఇందులో ఉన్న చిన్న చిన్న తప్పులు పంటికింద రాయిలా అప్పుడప్పుడూ అడ్డంపడుతుంటాయి. అలాంటి ఒక తప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది రోమాలు నిక్కబొడిచేటంత పెద్దతప్పేం కాదు.!కాకపోతే ఓ చిన్న రొమాంటిక్ తప్పు. ఇంతకీ అదేమిటంటే..?!
బాహుబలి మూవీ మొదటి పార్ట్ -1లో శివుడు అవంతిక(తమన్నా)ను వెతుక్కుంటూ వెళతాడు. ఓ దశలో ఇద్దరూ కలుసుకుంటారు, ప్రేమలో పడతారు. శారీరకంగా కూడా ఒకటవుతారు.
ఈ సన్నివేశాన్ని పాట రూపంలో ప్రేక్షక హృదయాలపై పచ్చబొట్టు వేశాడు దర్శకుడు. అయితే అదే పాట చివర్లో నీళం రంగు దుస్తులు ధరించిన అవంతిక రవిక వెనుక వైపు ముడి ఉండదు. పాటలో దాన్ని స్పష్టంగా చూడవచ్చు. కానీ ఇంకో సీన్‌లో అదే వస్త్రానికి ఆమె ముడి విప్పుతుంది.
ఇది సినిమాలో చాలా చిన్న మిస్టేక్. సినిమాల్లో దుస్తుల విషయంలో పొరపాట్లు జరగడం సహజం. వీటిని సినీ పరిభాషలో కంటిన్యుటీ మిస్టేక్స్ అంటారు. ఇవి ఒకటీ రెండు సార్లు చూస్తే పెద్దగా గుర్తించలేరు. ఒకటికి పదిసార్లు చూస్తేనే గమనించగలుగుతాం. వాటిని మనం వెతికి పట్టుకున్నప్పుడు వరల్డ్ కప్పేంరాదు. కాకపోతే అదో రకమైన “తుత్తి”.
రంధ్రాన్వేషణవల్ల సినిమాకు వచ్చే నష్టమేమీ ఉండదు. మాస్టర్ పీస్ లాంటి ఈ మూవీలో ఇలాంటివి కూడా జరగకుండా ఉంటే బావుంటదనేదే అభిమానుల భావన.
దర్శకులు రాజమౌళి ప్రతీ చిన్న విషయాన్ని సునిశితంగా గమనిస్తూ సినిమాలు తీస్తుంటారు. ఈ తప్పు విషయంలో ఆయన్ని తప్పుబట్టలేం. తెలుగు సినిమాలో అతను సాధించిన ప్రగతికి పేరుపెట్టలేం.