ఒంగోలు రాజకీయం కాకపుట్టిస్తోంది. ఇద్దరు నేతలు మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరుకుంటోంది. నేనా..నువ్వా అంటున్న ఆ ఇద్దరు నేతలు ఎవరి దమ్ము ఎంతో తేల్చుకునే పనిలో పడ్డారు. ఇక్కడెవరూ భయపడి వణికిపోవడం లేదని ఒకరు సవాలు విసురుతుంటే..దానికి ప్రతిగా మరొకరు కౌంటర్ గట్టిగానే వస్తున్నారు. దీంతో వీరి డైలాగ్స్ తో ఒంగోలు రాజకీయాలు హీటెక్కుతున్నాయి.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి, దామచర్ల జనార్థన్ మధ్య ఈ డైలాగ్ వార్ సాగుతోంది. ఒంగోలులో ఎవరి దమ్మెంతో చూసుకుందాం.. ఇక్కడెవరూ భయపడి ఒణికిపోవడం లేదని.. ఎన్నికల్లో తేల్చుకుందామంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. తాను చంద్రబాబుతో టచ్ లో ఉన్నానంటూ దామచర్ల జనార్థన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైరవుతున్నారు బాలినేని శ్రీనివాస్.
ఒంగోలు నుంచి తాను వైసీపీ టికెట్ పైనే మళ్లీ పోటీ చేస్తానంటున్నారు. అయితే బాలినేని వ్యాఖ్యలను ఖండించారు దామచర్ల. ఆయన చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని,ఒంగోలు నుంచి టిడిపి టికెట్ పై పోటీ చేసే అవకాశం ఉందని.. తాను ప్రచారం చేస్తున్నట్టు బాలినేని చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్నారు. తాను టీడీపీ టికెట్ పైనే ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. దమ్ముంటే ఎన్నికల్లో చూసుకుందామని బాలినేనికి సవాల్ విసిరారు. ఇక టీడీపీ హయాంలో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నానన్న ఆరోపణలపైనా స్పందించారు దామచర్ల జనార్థన్. బాలినేని అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు. ఆయన చంద్రబాబును కలుస్తున్నారా, పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారా అన్నది తనకు అవసరం లేదన్నారు.
ఇక ఏపీ రాష్ట్రానికి చెందిన చాలామంది సీయర్ రాజకీయనాయకులు..తమ తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్సీపీ నుంచి వారసుల ఎంట్రీ భారీగానే ఉంది. వేరే చోట ఎలా ఉన్నా..ఓ మాజీ మంత్రి వారసుడి ఎంట్రీతో ఒంగోలు పాలిటిక్స్ హీటెక్కాయి. ఒంగోలులో పట్టు నిలుపుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిని రంగంలోకి దింపారు.