అగ్నిపథ్ పై దాఖలైన పిల్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అగ్నిపథ్ పై అడ్వకేట్ శర్మీ ఇటీవల పిల్ దాఖలు చేశారు. దానిపై నేడు విచారణ జరిగింది.
విచారణ జరుగుతున్న సమయంలో జస్టిస్ డీ.వై చంద్రచూడ్ ఓ జోక్ వేశారు. నువ్వు వీరుడివైతే కావచ్చు కానీ అగ్నివీరుడివి కాదంటూ శర్మను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. దీంతో కోర్టులో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.
ఇటీవల పలు అంశాలపై శర్మ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేస్తున్నారు. దీంతో ఆయన చాలా పాపులర్ అయ్యారు. న్యాయమూర్తి కామెంట్స్ పై ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన కష్టాన్ని గుర్తించే జస్టిస్ చంద్రచూడ్ ఆ కామెంట్ చేశారని ఆయన అన్నారు.
అగ్నిపథ్ స్కీమ్ పై తొలి పిల్ ను తానే వేశానని, అందువల్లే జస్టిస్ చంద్రచూడ్ అలా అని ఉంటారని ఆయన పేర్కొన్నారు. సైన్యంలో నియామకాల కోసం ఇటీవల అగ్నిపథ్ స్కీమ్ ను కేంద్రం ఇటీవల తీసుకు వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకున్నాయి.