తెలుగు సినిమాలో కామెడి అంటే బ్రహ్మానందం, బ్రహ్మానందం అంటే కామెడి అన్నట్టుగా ఉంటుంది. దాదాపు 30 ఏళ్ళ పాటు ఆయన చేసిన కామెడి గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరో ఎవరు అయినా సరే ఆయన ఉంటే చాలు సినిమాల్లో కామెడికి కొదవ ఉండదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన్ను చూడటానికి అభిమానులు వెళ్ళేవారు అని చెప్పాలి. ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా లాభాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
అందుకే కొన్ని సందర్భాల్లో హీరో కంటే ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ ఉండేది అనే మాట వాస్తవం. టాలీవుడ్ చరిత్రలో ఆ రేంజ్ లో పారితోషికం అందుకున్న కమెడియన్ ఆయనే కావడం విశేషం. ఇప్పుడు సినిమాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారు. గత పదేళ్లుగా ఆయన హవా తగ్గుతూ వచ్చింది అనే మాట వాస్తవం. ఇక ఫ్యామిలీ తోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారు అనే చెప్పాలి.
ఇక సినిమాల్లో భారీగా రెమ్యునరేషన్ తో ఆస్తులు సంపాదించిన ఆయన ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు అని సమాచారం. వ్యాపారాల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారని అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో నష్టాలు రావడంతో కాస్త వెనక్కు తగ్గారని చెప్తారు. నేడు బ్రహ్మానందం పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే.