తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని దర్శకుడు దాసరి నారాయణ రావు. ఆయన చేసిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న చిన్న సినిమాలు అనుకున్నవి భారీ విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరూ అందుకోలేని ఘనతలను కూడా ఆయన అందుకున్నారు. ఇక దాసరి ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవారు. సాధారణంగా ఈ రోజుల్లో దర్శకులకు స్టార్ ఇమేజ్ వస్తే వేరే వాళ్ళు చెప్పే మాటలు కనీసం వినే ప్రయత్నం కూడా చేయరు.
కాని గతంలో అలా ఉండేది కాదు పరిస్థితి. స్టార్ దర్శకుడి ఇమేజ్ వచ్చినా ఏ ఇమేజ్ వచ్చినా సరే తగ్గి ఉండేవారు. ఇప్పుడు షార్ట్ ఫిలిం దర్శకుడు అయినా లెవెల్ కొడుతూ ఉంటారు. దర్శకుడుగా మంచి ఇమేజ్ ఉన్నా సరే… కథలో వేరే వాళ్ళు మార్పులు చెప్తే చేసేవాళ్ళు. దాసరి ఒక్కరే కథ, కథనం మరియు మాటలు, సంభాషణలు అన్ని రాసుకునేవారు. అన్నీ సరిగా ఉన్నా సరే ఆయన చుట్టూ కొందరు ఉండేవారు.
దాసరి గురువు పాలగుమ్మి పద్మరాజు అలాగే తమిళ రచయితలు ధర్మరాజు, తెలుగు లో దాసం గోపాల కృష్ణ, లక్ష్మణ రావు మరియు కాశి విశ్వనాధ్ వంటి రచయితలతో మాట్లాడి అన్నీ తెలుసుకునే వారు. వారితో నిత్యం చర్చలు సాగించి బాగా నేర్చుకునే వారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా దాసరి కథ విషయంలో జాగ్రత్తగా ఉండి ఒకటికి పది సార్లు ఆలోచించి సినిమా చేసేవారు.