సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిన సింగర్స్ లో మంగ్లీ ముందు వరుసలో ఉంటారు అనే చెప్పాలి. ఆమె సినిమాల్లో హీరోయిన్ తో సమానంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు వరుసగా ఆఫర్లు రావడంతో కెరీర్ లో దూసుకుపోతున్నారు మంగ్లీ. ఇక సినిమాల్లో నటించే ప్రయత్నం కూడా ఆమె చేస్తున్నారని టాక్ వస్తుంది. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడుతున్నారు.
దీనితో అసలు ఆమె రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఏంటీ అనే దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. ఆమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే మొదట్లో పాటకు 20 వేల వరకు తీసుకునేవారు. సొంత భాష కన్నడలో కూడా ఆమెకు అవకాశాలు బాగా పెరగడంతో క్రమంగా రెమ్యునరేషన్ పెంచుతూ వెళ్తున్నారు. అటు తెలంగాణా సంసృతికి చెందిన పాటలు కూడా బాగా పాడుతూ ఇమేజ్ పెంచుకున్నారు.
దీనితో పాటకు లక్ష వరకు ఆమె డిమాండ్ చేస్తున్నారు అని టాక్. స్టార్ హీరోల సినిమాలు అయితే రెండు నుంచి మూడు లక్షల వరకు అడుగుతున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు డిమాండ్ పెరుగుతుంది. ఇక యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఆమె బాగానే సంపాదిస్తున్నారు. అటు ప్రకటనల్లో కూడా మంగ్లీ బాగానే సంపాదిస్తున్నారు.