మన తెలుగులో ఒకప్పుడు కమెడియన్ లకు భారీ డిమాండ్ ఉండేది అనే మాట వాస్తవం. అయితే క్రమంగా కమెడియన్ లను పక్కన పెట్టి హీరోలు కామెడి చేయడం నేర్చుకున్నారు అనే చెప్పాలి. ప్రస్తుతం కామెడి సినిమాల విషయంలో ఫాన్స్ అంతగా ఆసక్తి చూపించకపోవడంతో డైరెక్ట్ లు లైట్ తీసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా కామెడి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్త పడ్డారు.
దీనితో కామెడి చేసే నటులకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. భారీ రెమ్యునరేషన్ తో చేసే కమెడియన్ లకు అయితే అసలు అవకాశాలే రావడం లేదని చెప్పాలి. కాని తమిళంలో మాత్రం స్టార్ కమెడియన్ సంతానం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఎప్పుడో తమిళ సినిమాలో అడుగు పెట్టిన ఈ స్టార్ యాక్టర్ కు భారీ ఆఫర్లు వస్తున్నాయి. కథ ఎలా ఉన్నా సంతానం ఉంటే చాలు అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది.
ఇప్పుడు అజిత్ తో విజ్ఞేశ్ శివన్ చేస్తున్న ప్రాజెక్ట్ కి గాను అతన్ని ఎంపిక చేసారు. దీనితో 60 కాల్షీట్స్ కోసం గాను ఏకంగా 9 కోట్లు అడిగాడు అని టాక్. అయినా సరే నిర్మాతలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. సంతానం ఈ సినిమాలో అజిత్ కి బావగా నటిస్తాడు అని టాక్. ఏది ఎలా ఉన్నా మన తెలుగులో హీరోల రెమ్యునరేషన్ మాదిరిగా ఉంది సంతానం రెమ్యునరేషన్.