సాధారణంగా యువతీ యువకులు యుక్త వయసులోకి వచ్చే సమయంలో అందంపై దృష్టి పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది తాము అందంగా లేమంటూ మనస్థాపానికి గురి అవుతుంటారు. కాగా తాజాగా విశాఖపట్నంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముఖంపై మొటిమలతో అందంగా లేననే కారణంతో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గొర్లె వెంకటరావు కుమారుడు సాయి కృష్ణ కు ముఖం పై మొటిమలు రావడం తో ప్లాస్టిక్ సర్జరీ కోసం తండ్రిని రూ.2 లక్షలు
అడిగాడు. అంత మొత్తం ఇవ్వలేనని రూ.60,000 ఇచ్చాడు. అయినా మొటిమలు తగ్గకపోవడంతోమనస్తాపం చెందిన సాయి కృష్ణ మేడ పైకి వెళ్లి ఉరివేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.