
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగ శౌర్య. అయితే టాలీవుడ్ లో మొన్నటి వరకు మోస్ట్ బ్యాచిలర్స్ గా ఉన్న యంగ్ హీరోలందరూ లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిపోయారు. ఈ నేపథ్యంలోనే నిఖిల్, నితిన్ లు మూడు ముళ్ళు వేసేశారు. అయితే నాగ శౌర్య కు ఇటీవల ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా నాగ శౌర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ విషయం లో అమ్మకి ఛాయిస్ వదిలేశాను. అమ్మ ఎవర్ని చూస్తే ఆ అమ్మాయినే ప్రేమిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఏదైనా అమ్మ ఇష్టం. అమ్మకి నచ్చితే నాకు నచ్చినట్టే. ఈ విషయంలో నా ఇష్టాలు కంటే అమ్మ ఛాయిసే బెటర్. ఎందుకంటే నాకు ఏమేం కావాలో అమ్మకే బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.