నందమూరి బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో సినిమా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ టైటిల్ ఇంకా ఖరారు చేయాల్సి ఉండగా… బాలకృష్ణతో సమానంగా నటించే ఛాన్స్ ఉన్న ఓ క్యారెక్టర్ కోసం చాలా రోజుల నుండి చిత్ర యూనిట్ వెతుకుతుంది.
ఇటీవల హీరో నిఖిల్ ను సంప్రదించగా… నిఖిల్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బోయపాటి టీం ఆది పినిశెట్టి, నారా రోహిత్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎంపిక పూర్తవనున్నట్లు సమాచారం.
ఫైనలైజ్ కాగానే సెట్స్ కు హజరయ్యేలా షెడ్యూల్ ప్రిపేర్ చేయనున్నారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… మోనార్క్ అనే టైటిల్ ఖారరు చేసే అవకాశం ఉంది. బాలయ్య డబుల్ యాక్షన్ చేయనున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.