టాలీవుడ్ లో ‘జయం’ సినిమాతో హీరోగా పరిచయమయిన యాక్టర్ నితిన్. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నితిన్ నటనపరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలతో కెరీర్ మంచి జోష్ మీద స్టార్ట్ చేశాడు. కానీ ఆ తరువాత వరుస ఫ్లాప్ లతో సతమతమయ్యాడు. అందరూ కూడా నితిన్ పని అయిపొయింది అనుకున్నారు. ఆ సమయంలో ‘ఇష్క్’ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా..!
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యాచిలర్ గా ఉన్న హీరో నితిన్. ఇప్పుడు నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొన్ని రోజులుగా నితిన్ పెళ్లిపై వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. తాజా నితిన్ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. ఆ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisements
నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 21 న రిలీజ్ కానుంది.