నితిన్ జైలుకు వెళ్లడమేంటి..? నితిన్ ఏం చేశాడని అతను జైలుకు వెళ్తాడు అని సందేహపడుతున్నారా…?ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.
నితిన్ , రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా నటించిన భీష్మ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలోను , అటు ప్రేక్షకులలోను భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం పూర్తికాగానే మరో సినిమాపై నితిన్ దృష్టి పెట్టాడు. ఇప్పటికే రంగ్ దే అనే సినిమా చేస్తోన్న నితిన్.. మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడట.
ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపించనున్నారట. మొత్తం చిత్రం అంతా కూడా జైలు బ్యాక్ డ్రాప్ లోనే సినిమా రూపొందనుందట. భవ్య క్రియేషన్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చనున్నారని తెలుస్తోంది.