తెలుగు హీరోల్లో అందరూ ఇప్పటికే ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయిపోయారు. యంగ్ హీరోలు, వెటరన్స్ అంతా లాక్ డౌన్ టైంలో కథలు విని, నెక్ట్స్ సినిమాలను ఫైనల్ చేసేసుకున్నారు. కానీ రాంచరణ్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఏ సినిమా చేయాలన్నది ఇంకా ఫిక్స్ చేయలేదు.
దర్శకులు సందీప్ వంగా, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి రాంచరణ్ ను కలిసి కథ వినించేందుకు రెడీ అయ్యారు. కానీ చరణ్ మాత్రం తొందరపడటం లేదు. లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించిన చరణ్, ఇప్పుడిప్పుడే తన ఫోకస్ ను సినిమా నిర్మాణాలపైకి మరల్చినట్లు తెలుస్తోంది.
చిరు తన నెక్ట్స్ సినిమాలో చరణ్ గా రాబోతున్నాడు. చిరు కోసం పలు కథలు ఇప్పటికే వెయిటింగ్ లో ఉన్నాయి. దీంతో చిరు సినిమాల నిర్మాణంపై రాంచరణ్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై చిరు సినిమాలకు చరణ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.