మహా సముద్రం సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో శర్వానంద్. ఈ సినిమా చేస్తూనే… కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మహా సముద్రం షూటింగ్ ఎండ్ కు వచ్చినప్పటి నుండే శర్వా తన నెక్ట్స్ మూవీస్ పై ఫోకస్ చేశారు.
తాజాగా కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వక్కంతం వంశీ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అందించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది.