హీరో సిద్దార్థ్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తీశారు సిద్దార్థ్. ఇక ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. ఇందులో శర్వానంద్ కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ గురువారం రిలీజ్ చేసింది. అయితే ట్రైలర్ ఈవెంట్ కు అందరూ వచ్చారు కానీ సిద్దార్థ్ మాత్రం రాలేదు.
దీనితో సిద్దార్థ్ ఎక్కడ అని డైరెక్టర్ ను అభిమానులు అడగగా… సిద్దార్థ్ ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారని.. అందుకే ఈ ఈవెంట్‌కు ఆయన రాలేకపోయారని అజయ్ తెలిపారు. అయితే అది దేనికి సంబంధించిన ఆపరేషన్ అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.