చాలా మంది తెలుగు హీరోయిన్లు మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం ఒక్క హిట్‌తో తమ రెమ్యునరేషన్ పెంచేసి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఒక్క సక్సెస్ వస్తే చాలు నిర్మాతలకు షాక్ ఇస్తూ ఉంటారు.
అయితే పెళ్లిసందడి సినిమాలో రోషన్ హీరోయిన్ గా న టించిన శ్రీలీల ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా రూ.72 ల క్ష లు తీసుకుంటోందట. ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి ఆ సినిమా సక్సెస్ కాకపోయినా పారితోషికం పెంచేసిందట. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల విజయాలతో హ్యాట్రిక్ సాధించిన కృత్తిశెట్టి ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఖిలాడీ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయాతి కూడా తన రెమ్యునరేషన్ పెంచిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేరు. అందుకే ఈ హీరోయిన్లు రెమ్యునరేషన్ పెంచేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక డీజే టిల్లు సినిమాతో ఘనవిజయం సాధించిన నేహా శెట్టి కూడా రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట. ఈ హీరోయిన్ల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అయితే వారి డిమాండ్ మరింత పెరగడం ఖాయం అని చెప్పొచ్చు. మరోవైపు స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. పూజా హెగ్డే, రష్మిక, సమంత, తమన్నాతో పాటు మరికొందరు హీరోయిన్లు ఆ లిస్ట్‌లో ఉన్నారు.