యూపీలో తనను మోసం చేశాడని బాయ్‌ఫ్రెండ్‌పై యువతి యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో 28 ఏళ్ల దేవేంద్ర రాజ్‌పుత్ మరణించటం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆగ్రాలోని హరిపర్వత్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తనను ప్రేమించి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన ఆ యువతి ఈ యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన దేవెంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్న దేవేంద్ర రాజ్‌పుత్ అదే ల్యాబ్‌లో పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. అంతేకాదు వీరిద్దరూ కొంతకాలం స్థానికంగా ఓ అద్దె ఇంట్లో సహజీవనం సాగిస్తున్నారు. అబ్బాయికి వారి తల్లితండ్రులు మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేయటం, దేవెంద్ర కూడా పెళ్లికి ఒప్పుకోవటంతో ఆ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీలింగ్ ఫ్యాన్‌ను రిపేర్ చేయాలంటూ ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి రప్పించింది. అప్పటికే తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ తో ఇంటికి వచ్చిన బాయ్ ఫ్రెండ్ పై దాడి చేసింది. యాసిడ్ చల్లే సమయంలో ఆ యువతిపై కూడా కాస్త పడగా తనకు కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి.
యాసిడ్ దాడిపై దేవేంద్ర తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.