మనిషి పుట్టుక, చావు అనేది సహజం. అయితే.. చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్యనే చేసుకున్నాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త దేశంలో సంచలనంగా మారింది. దీని గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది.
రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్(19) అనే యువకుడు ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎలా ఉంటాడని ఎప్పటి నుండో ఒక అనుమానం ఉండేది. అందుకోసం యూట్యూబ్ లో గూగుల్ లో సెర్చ్ చేసేవాడు. ఎన్ని వీడియోలు చూసినా నమ్మకం కలగకపోవడంతో.. తానే స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు.
హాస్టల్ లో ఎవరు లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడు రాసిన సూసైడ్ నోట్ చూసి షాక్ అయ్యారు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
తాను దాచిపెట్టిన రూ.5 వేల నగదును అమ్మకు అప్పగించాలని అందులో రాశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.