అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు ప్రమాదవ శాత్తు మరణించాడు. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన యువకుడు ఉద్యోగం వచ్చిన మూడు రోజులకే మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గ్రామానికి చెందిన రవికుమార్(35) ఈ నెల 17న అమెరికాకు వెళ్లాడు. అక్కడ మూడు రోజుల క్రితం అతను సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో కంటెయినర్ పై నుంచి జారి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
రవికుమార్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు కంపెనీ ప్రతినిధులు గురువారం తెలియజేశారు. రవికుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు
ప్రభుత్వం సాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇది ఇలా వుంటే నాలుగు రోజుల క్రితం అమెరికాలో కర్నూలు జిల్లా విద్యార్థిని మృతి చెందింది. ఆదోనికి చెందిన జాహ్నవి ఉన్న విద్య కోసం అమెరికాకు వెళ్లారు. ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాహ్నవి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.