నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఓ చోట ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా బయటికెళ్లాలంటే భయం.. చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ఏదో ఓ రూపంలో వేధింపులకు గురవుతున్న పరిస్థితి. ఆఖరికి ఇంట్లో ఉన్నా కూడా భయమే.
హైదరాబాద్ లో ఓ ఘటన వెలుగుచూసింది. ఫిలింనగర్ లో ఓ ఇంట్లో స్నానం చేస్తున్న మహిళను వీడియో తీశాడు ఓ యువకుడు. అది గమనించిన మహిళ గట్టిగా అరవడంతో యువకుడ్ని పట్టుకున్నారు స్థానికులు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు.