[sonaar_audioplayer artwork_id=”” feed=”https://tolivelugu.com/wp-content/uploads/2022/05/fire.mp3″ player_layout=”skin_float_tracklist” hide_progressbar=”default” display_control_artwork=”false” hide_artwork=”false” show_playlist=”false” show_track_market=”false” show_album_market=”false” hide_timeline=”false”][/sonaar_audioplayer]
దారి విషయంలో తలెత్తిన వివాదంలో ఓ యువకుడు అధికారులపై దాడి చేశాడు. వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన అధికారులపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ప్రమాదంలో ఎంపీఓకు స్వల్ప గాయాలు అవ్వగా.. మిగతా అధికారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.
బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన.. చుక్కా గంగాధర్, తిరుపతిల మధ్య ఇంటి వద్ద దారి విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ విషయమై గంగాధర్ రోడ్డుకు అడ్డంగా కట్టెలు పెట్టాడు. ఎవరు నడవకుండా దారిని మూసేశాడు.
దీంతో తిరుపతి అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఎస్సై గౌతమ్ పవర్, తహశీల్దార్ అరిపోద్దిన్, ఎంపీఓ రామకృష్ణ గంగాధర్ ఇంటి వద్దకు వెళ్లారు. అయితే, అప్పటికే గంగాధర్ పురుగుల మందు స్ప్రే చేసే దాంట్లో పెట్రోల్ నింపి పెట్టాడు. అధికారుల రాకను గమనించి స్ప్రే చేసి నిప్పు పెట్టాడు.
అయితే, పెట్రోల్ స్ప్రే చేయటం గమనించిన ఎస్సై అతన్ని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అంతలోనే అక్కడే ఉన్న ఎంపీఓ రామకృష్ణకు మంటలు అంటుకున్నాయి. దీంతో మిగతా అధికారులు పరుగులు తీశారు. అయితే, ఎంపీఓ వెంటనే చొక్కా తీసేయటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత ఎంపీఓను చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన గంగాధర్‌ను తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.