ఆ యువకుడో పూజారి. ప్రతిరోజు గుడిలో పూజలు చేస్తుంటాడు. ప్రతి రోజు గుడికి వచ్చే బాలికలకు మంత్రాలతో పాటు ప్రేమ పాటలు కూడా చెప్తుంటాడు. ఆ పూజారి చెప్పిన ప్రేమ పాటలకు అభం శుభం తెలియని ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక బలైపోయింది.
సిద్ధిపేటకు చెందిన మహేందర్ స్థానికంగా ఉన్న ఆలయంలో పూజారిగా చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి సంవత్సరంగా నుంచి లైంగికంగా వాడుకుంటున్నాడు.ఆ బాలికతో సన్నిహితంగా దిగిన ఫోటోలను వాట్సాప్ లో వైరల్ చేస్తుండటంతో విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేందర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.