కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లన్నీ మూసేసిన సంగతి తెలిసిందే. సుమారు తొమ్మిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ బిగ్ స్క్రీన్ పై సినిమా రిలీజ్ కాక సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. థియేటర్లో ఓపెనింగ్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చినప్పటికీ జనాలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఒకటి రెండు రిలీజ్ అయినప్పటికీ జనాలు మాత్రం అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఈ నేపథ్యంలోనే చాలా సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఇక థియేటర్ల రీఓపెనింగ్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు.
ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ప్రభాస్ కోరారు. సురక్షితంగా సినిమా చూసే అనుభవాన్ని అందించేందుకు సినిమాలు తిరిగి వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు.మన సినిమాలను బిగ్ స్ర్కీన్‌లో ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అని అభిమానులకు పిలుపునిచ్చారు.