అక్టోబర్ 23.. ఇది కొంతమందికి క్యాలెండర్ లో ఒక రోజు మాత్రమే కావొచ్చు కానీ ప్రభాస్ అభిమానులకి మాత్రం ఇది చాలా స్పెషల్ డే ఎందుకంటే ఇది యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు. ప్రతి ఇయర్ ఈ డేట్ కి ఎదో ఒక ట్రెండ్ చేసే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఇయర్ కూడా కామన్ డీపీని చేంజ్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ కామన్ డీపీలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ట్విట్టర్ లో బర్త్ డే ట్రెండ్ ఈరోజు ఈవెనింగ్ నుంచి మొదలుకానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ సర్ప్రైజ్ బయటకి రానుందని సమాచారం.
ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి, గతంలో యూరోప్ లో షూట్ కూడా చేశారు. అయితే సాహూ కారణంగా డిలే అయిన జాన్ మళ్లీ మొదలుకాబోతుందని, త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారని సమాచారం. జాన్ సినిమాకి సంబంధించిన పోస్టర్ కానీ, టైటిల్ అనౌన్స్మెంట్ కానీ ప్రభాస్ బర్త్ డే రోజున బయటకి వచ్చే అవకాశం ఉంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పామ్ రీడర్ గా కనిపిస్తుండగా, పూజ హెగ్డే టీచర్ గా కనిపించనుంది. జాన్ కోసం హైదరాబాద్ లో యూరోప్ సెట్ వేస్తుండడం విశేషం.