యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే జార్జియా నుండి తిరిగొచ్చాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రం చేస్తున్న ప్రభాస్… ఓ ఛేజింగ్ షూట్ కోసం జార్జియా వెళ్ళొచ్చాడు. స్పెషల్ జెట్ లో ఇండియాకు తిరిగొచ్చిన ప్రభాస్… స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ప్రకటించారు.
ఇదే చిత్రంలో ఉన్న కమెడియన్ ప్రియదర్శి కూడా ప్రభాస్ బృందంలో ఉన్నాడు. ఇండియాకు తిరిగివచ్చిన వెంటనే… సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రకటించడంతో మరి ప్రభాస్ సంగతి ఏంటి అని అంతా చర్చించుకున్నారు. తాజా ప్రభాస్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లి కరోనా పై జాగ్రత్తగా ఉండండి అంటూ మంచి మెసేజ్ ఇచ్చాడు.