ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్ రెడీ అయింది. మోడీ చరిత్రను ప్రతీ ఒక్కరికీ తెలిసే విధంగా మన్ బైరాగీ టైటిల్‌తో ఓ సినిమా త్వరలో వెండితెరపై సందడి చేయనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను 17న ప్రధాని పుట్టినరోజు సందర్భంగా బాహుబలి ప్రభాస్ విడుదల చేయనున్నారు. ప్రధాని మోడీ జీవితంలో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలు ఈ మూవీలో ఉంటాయి.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథ బాగా నచ్చడంతో బన్సాలీ నిర్మించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. చాలా పరిశోధన చేసి రాసిన ఈ కథలో ప్రధాని యువకుడిగా ఉన్న సమయంలో ఆయన జీవితంలో జరిగిన ముఖ్య మలుపు కీలకం. ఈ చిత్ర కథ అందరికీ నచ్చుతుందని బన్సాలీ నమ్మకం.
మన్ బైరాగీ సినిమాకు సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీతోపాటు ఈ సినిమాను మహావీర్ జైన్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. గతంలో వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన నరేంద్రమోడీ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దాని కంటే ఆసక్తికలిగించే అంశాలతో మన్ బైరాగీ రూపొందిస్తున్నారని టాక్.