కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు సతీష్ వేగేశ్నకు మంచి పేరుంది. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం వంటి కుటుంబ నేపథ్యమున్న చిత్రాలు మంచి హిట్ కొట్టడంతో సతీష్ వేగేశ్న మరో ప్రయోగానికి సిద్ధపడ్డాడు. “ఎంతమంచి వాడవురా “తో మరో కుటుంబ కథ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రావు, మెహ్రీన్ నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి సందర్బంగా ఈ నెల 15వ తేదీన విడుదల అవ్వనుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 8వ తేదీన జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన రాకని ఖరారు చేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.