యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. తాజాగా ఈ షో లో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ సినిమాలలో కల్లా తనకు ఇష్టమైన సినిమా తొలిప్రేమ అని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇది విన్న పవన్ ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. అలాగే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.