యంగ్ హీరో అల్లు శిరీష్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అంచనాలకు మించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం విడుదలై ఏడాది అవుతున్నా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటుంది.
లేటెస్ట్ గా ఎంతో ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ను ఈ మూవీ దక్కించుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నుంచి సీఎం జగన్ వరకు ప్రముఖ రాజకీయ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అందరిలా అల్లు శిరీష్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ యూనిట్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. శిరీష్ ట్విట్టర్ లో అందరినీ ట్యాగ్ చేసి.. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను మాత్రం ట్యాగ్ చేయకుండా #ntrjr అని పేర్కొన్నారు. వాస్తవానికి తారక్ కు అధికారిక ట్విట్టర్ ఖాతా ఉంది.
అయితే అల్లు శిరీష్ కావాలనే ఈ విధంగా చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు. అల్లు శిరీష్ పొరపాటు చేసి ఉంటే ఆ తర్వాత అయినా ట్వీట్ ను ఎడిట్ చేయవచ్చు. కానీ అల్లు శిరీష్ మాత్రం నెటిజన్ల కామెంట్లను పట్టించుకోలేదు. చరణ్ ని ట్యాగ్ చేసినట్టుగానే.. ఎన్టీఆర్ ని కూడా ట్యాగ్ చేసి ఉంటే బాగుండేది.. హ్యాష్ ట్యాగ్ ఉపయోగించడం కరెక్ట్ కాదంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Congrats to the whole team of RRR on winning the Golden Globe, Best Original song for Naatu Naatu. Proud moment for TFI & Indian cinema. @AlwaysRamCharan @ssrajamouli @mmkeeravaani #NTRJr @RRRMovie 🥳🎉🎊
— Allu Sirish (@AlluSirish) January 11, 2023