మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. అయితే మరోవైపు రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ పేరు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇక టీడీపీ అభిమానులు, నందమూరి వంశాభిమానులనేగాక రాజకీయాల్లోకి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూసేవరకు లేకపోలేదు.
తాజాగా ఏపీలో ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కు సంబంధించిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో వెలిసిన ఈ పోస్టర్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ ఫ్లెక్సీని అభిమానులు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటూ టీడీపీ నేతల ఫోటోలు కూడా ఉండటం విశేషం.