రోజురోజుకి ఆడపిల్లల మీద ఆరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పడానికి కాకినాడలో జరిగిన ఘటనే నిదర్శనం. తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని హతమార్చాడు ఓ ప్రేమోన్మాది. అసలేం జరిగిందంటే..ప్రేమించడం లేదని ఓ యువతిని దారికాసి గొంతుకోసి చంపేశాడో యువకుడు.
ఏపీలోని కాకినాడ జిల్లా కూరాడకు చెందిన యువతిని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ.. ప్రేమించాలంటూ ఓ యువతి వెంట పడేవాడు. కానీ ఆ యువతి అందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న యువకుడు.
ఇవాళ కూరాడ-కాండ్రేగుల గ్రామాల మధ్య దారి కాచాడు. ఆ మార్గంలో యువతి నడిచి వెళ్తుండగా కత్తితో ఆమె గొంతు కోశాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు చూసి.. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ అంబులెన్స్ వచ్చేసరికి యువతి ప్రాణం పోయింది.
పారిపోయేందుకు యత్నించిన యువకుడిని.. చెట్టుకు కట్టేసి స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులో తీసుకున్నారు.