ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది తమ టాలెంట్ ను చూపిస్తూ ఫేమస్ అయ్యారు.వారిలో యూట్యూబర్ శ్రియా మురళీధర్ కూడా ఒకరు. అయితే శ్రియా మురళీధర్ సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్కు గురై మృతి చెందటం విస్మయానికి గురిచేసింది. శ్రియా మురళీధర్ వయసు 27 ఏళ్ళు. అతిచిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవటం అందరిని షాక్ కు గురిచేస్తోంది.
యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షోలో శ్రియ మురళీధర్ మొదటి కంటెస్టెంట్ గా వచ్చారు.ఆ తరువాత యూట్యూబ్లో విభిన్నమైన షార్ట్ ఫిలింస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు.