మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి యువకులను చెదరగొట్టారు.
ఈ ఘటన వరంగల్ లోని పోచమ్మ మైదాన్ లో చోటు చేసుకోవడంతో కలకలం రేపింది.వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ లో యువకులు మద్యం మత్తులో విచక్షణారహితంగా ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు.
నడిరోడ్డు పై నానా హంగామా చేశారు. మాట మాట పెరిగి చేతికి అందినదానితో చితక్కొట్టుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా మందు బాబులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఎంత చెప్పిన వినకపోవడంతో పోలీసులు లాఠీకి పని పెట్టారు.