కరీంనగర్ జిల్లాలో మందుబాబులు హల్ చల్ సృష్టించారు. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న షీటీం మహిళా కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. అలర్ట్ అయిన కానిస్టేబుల్ స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
షీటీం మహిళా కానిస్టేబుల్ హైదరాబాద్ నుండి మంచిర్యాల వెళ్తోంది. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఆమెను అడ్డగించారు. ఆమె షీటీం కానిస్టేబుల్ అని చెప్తున్నప్పటికీ పట్టించుకోకుండా.. తనను ముందుకు వెళ్లనివ్వకుండా కారును అడ్డంగా పెట్టి.. ఆమెతో దురుసుగా ప్రవర్తించారు.
దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఐదుగురు మందుబాబులను అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. ఐదుగురు యువకులు రేణికుంట టోల్ ప్లాజా వద్ద గొల్లపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
అయితే.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకోకుండా రక్షించే షీటీం కానిస్టేబుల్ కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలతో రాష్ట్రం అట్టుడుకుతున్న నేపథ్యంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.