రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ ఏళ్ల యువకుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన జడ్జీగా చరిత్ర సృష్టించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఐదేళ్ల ఎల్.ఎల్.బి డిగ్రీ పూర్తి చేసిన మయాంక్ ప్రతాప్ సింగ్ 21 ఏళ్ల వయస్సులో రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి మొదటి ప్రయత్నంలో జడ్జీగా ఎంపికయ్యాడు. రాజస్థాన్ జ్యుడీషియల్ ఎగ్జామ్-2018 రాయడానికి రోజుకు 12-13 గంటలు చదివే వాడినని… ఉద్యోగం వస్తుందని ముందే ఊహించినట్టు తెలిపాడు. మంచి జడ్జీ కావాలంటే నిజాయితీ అన్నింటి కంటే ముఖ్యమని…బయటి శక్తులకు ప్రభావానికి లోనుకాకూడదని అన్నారు. గతంలో రాజస్థాన్ జ్యుడీషియల్ ఎగ్జామ్స్ రాయడానికి 23 సంవత్సారాల వయసుండగా ఈ సంవత్సరం దాన్ని 21 సంవత్సారాలకు తగ్గించారు.